అర్హులైన వారికి ఉచిత న్యాయం | - | Sakshi
Sakshi News home page

అర్హులైన వారికి ఉచిత న్యాయం

Sep 27 2026 2:15 PM | Updated on Sep 27 2026 2:15 PM

జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్‌

జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్‌

సిద్దిపేటకమాన్‌: అర్హులైన ప్రతీ వ్యక్తికి ఉచిత న్యాయ సహాయం అందేలా ప్యానల్‌ లాయర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్‌ పేర్కొన్నారు. సిద్దిపేట కోర్టు కాంప్లెక్స్‌లో జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో ప్యానల్‌ లాయర్లు, జైలు విజిటింగ్‌ లాయర్లకు శనివారం ఓరియంటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ..న్యాయ సహాయం అవసరమైన పేదలు, బలహీన వర్గాలు, మహిళలు, పిల్లలు, ఖైదీలకు న్యాయసేవలు సమర్థవంతంగా అందించడంతో న్యాయవాదులపాత్ర ఎంతో ముఖ్యమన్నారు. జైలు విజిటింగ్‌ లాయర్లు జైళ్లను సందర్శించి, ఖైదీల న్యాయపరమైన సమస్యలు తెలుసుకుని వారికి బెయిల్‌, అప్పీల్‌, తదితర న్యాయపరమైన అవకాశాలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జయప్రసాద్‌, సౌజన్య, ప్యానల్‌ లాయర్లు, జైలు విజిటింగ్‌ లాయర్లు పాల్గొన్నారు.

స్పెషల్‌ లోక్‌ అదాలత్‌లో

8 బ్యాంకు కేసుల పరిష్కారం

జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కోర్టులో శనివారం స్పెషల్‌ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. స్పెషల్‌ లోక్‌ అదాలత్‌లో జిల్లాలోని వివిధ బ్యాంకుల నుంచి మొత్తం 8 కేసుల్లో రూ.11,94,000 పరిష్కరించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement