మెరుగైన వైద్య సేవలు అందించండి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్య సేవలు అందించండి

Sep 13 2026 11:21 AM | Updated on Sep 13 2026 11:21 AM

కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

బెజ్జంకి(సిద్దిపేట): మండల కేంద్రంలో శనివా రం కలెక్టర్‌ హైమావతి ఆకస్మికంగా పర్యటించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి హాజరు, ఓపీ రిజిస్టర్లను పరిశీలించారు. 24 గంటలూ రోగులకు అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు. సీజనల్‌ వ్యాధుల వివరాలను అడగి తెలుసుకున్నారు. శానిటేషన్‌ డ్రైవ్‌ చేపట్టి సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం పీఎంశ్రీ మాడల్‌ స్కూల్‌ను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో ఆస్పత్రి, మోడల్‌ స్కూల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఎడ్ల లక్ష్మీకి

బాల సాహిత్య పురస్కారం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): బాల సాహిత్యంలో విశేష కృషి చేస్తున్నందుకు జిల్లా కేంద్రానికి చెందిన ఎడ్ల లక్ష్మీ జాతీయ బాల సాహిత్య పురస్కారం అందుకున్నారు. సిరిసిల్లలో రంగి నేని ట్రస్ట్‌ నిర్వహిస్తున్న పిల్లల పండుగలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎడ్ల లక్ష్మీ పురస్కారం అందుకున్నట్లు బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం శనివారం తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ పత్తిపాక మోహన్‌, గరిపల్లి అశోక్‌, సిద్దిపేట బాలసాహితీవేత్తలు తదితరులు పాల్గొన్నారన్నారు.

పాలనలో కాంగ్రెస్‌

ప్రభుత్వం విఫలం

ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి

గజ్వేల్‌: అబద్ధపు పునాదులపై ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫ్యల్యాలను చాటుకున్నదని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం వర్గల్‌ మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బోయిని కుమార్‌, బీజేపీ వార్డు సభ్యురాలు లావణ్య, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కనకయ్యలు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ప్రతాప్‌రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్‌ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలబెడితే.. నేడు రేవంత్‌రెడ్డి ఆధోగతి పాలుచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్‌ను ప్రజలు ఇక క్షమించరని చెప్పారు. కార్యక్రమంలో వర్గల్‌ మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, శేరిపల్లి సర్పంచ్‌ పావని, బీఆర్‌ఎస్‌ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నాగరాజు, వర్గల్‌ మాజీ సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement