ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం యుద్ధప్రాతిపదికన స్థల సేకరణ పూర్తి చేయాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించినప్పటికీ ఆచరణలో మాత్రం ప్రక్రియ ఇప్పటికీ మొదలుకాలేదని తెలిసింది. హైవేకు సమీపంలో అనువైన ప్రభుత్వ భూమిని గుర్తించడం దానికి సంబంధించిన నిధులు కేటాయింపుపై ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. 4,827 ఎకరాల విస్తీర్ణం కలిగిన శనిగరం ప్రాజెక్టులో ఏటా భారీగా చేపల దిగుబడి వస్తున్నందున ఇక్కడ అత్యాధునిక హంగులతో కూడిన మార్కెట్ యార్డు నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాల్సిన అవసరం ఉంది.
దిగుబడి పెరుగుతోంది..మార్కెట్ ఎక్కడ?
ప్రాజెక్ట్‌లో ఇప్పటికే 10లక్షల చేప పిల్లలు 4లక్షల రొయ్య పిల్లలను విడుదల చేసి దిగుబడి పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఇవి పెద్దవయ్యక మత్స్యకారులు నష్టపోకుండా సరైన ధరకు అమ్ముకోవడానికి ఈ షిష్‌హబ్ సకాలంలో అందుబాటులోకి రావాల్సి ఉంది. మార్కెటింగ్ సదుపాయం, కోల్డ్‌స్టోరేజీల నిర్మాణం ఆలస్యమైతే మత్య్సకారులకు ఇబ్బందులు తప్పవని స్థానిక సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.
త్వరగా ప్రారంభించాలని విజ్ఞప్తి..
మత్స్యకారుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలనే ప్రభుత్వ ఉద్దేశం మంచిదైనప్పటికీ క్షేత్ర స్థాయిలో పనులను మరింత వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. కేవలం ప్రణాళికల రూపకల్పనకే పరిమితం కాకుండా తక్షణమే బడ్జెట్ నిధులు విడుదల చేసి ఈ ఫిష్‌హబ్ పనులను ప్రారంభించాలని తద్వారా ఈ ప్రాంత మత్స్యకారులకు త్వరగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
శనిగరం ప్రాజెక్ట్
శనిగరం ప్రాజెక్ట్ పరిధిలోని మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన ఫిష్‌హబ్ నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాకపోవడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. రాజీవ్ రహదారికీ ఆనుకుని అత్యాధునిక హంగులతో భారీ విక్రయ కేంద్రం, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటన వెలువడి నెలలు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంతో మత్స్యకారులు కొంత ఆందోళన నెలకొంది.
–కోహెడరూరల్(హుస్నాబాద్)
మంత్రి పొన్నం ప్రకటించిన మాస్టర్‌ప్లాన్
షిష్‌హబ్ ఏర్పాటుపై ఇంకారాని స్పష్టత
క్షేత్రస్థాయిలో వేగవంతం కాని స్థలసేకరణ
ప్రాజెక్టులో పెరిగిన చేపల దిగుబడి
విక్రయ కేంద్రం కోసం ఎదురుచూపులు


