అక్కన్నపేట(హుస్నాబాద్): గ్రామాల సమగ్రాభివృద్ధికి నిధులివ్వాలని కోరుతూ ఆదివారం అక్కన్నపేట మండలంలోని పలువురు సర్పంచులు రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మర్యాద పూర్వకంగా హైదరాబాద్‌లో కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బానోతు వెంకటేశ్ నాయక్ మాట్లాడుతూ..మండలంలో మొత్తం 38గ్రామాలు ఉండగా అందులో 06 గిరిజన తండాలు( శ్రీరాంతండా, చౌటకుంట, సేవాలాల్ మహారాజ్‌తండా, హాతీరాం అంబనాయక్‌తండా, దాసుతండా, కెప్టన్ చౌడుతండా)లు గ్రామాలుగా ఏర్పాటు కాగా, జీపీలో ఉన్న నిధులు విత్‌డ్రాలు కావడంలేదన్నారు. జీపీడీపి ప్లాన్ లేదని, జీపీలో ఉన్న నిధులు తీసుకునేందుకు అవకాశం కల్పించాలని విన్నవించినట్లు చెప్పారు. సర్పంచులుగా గెలిచినప్పటి నుంచి సుమారుగా తొమ్మిది నెలల కాలం వ్యవధిలో గ్రామా భివృద్ధిలో భాగంగా రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఖర్చు చేశామని తెలిపారు. ఖర్చు చేసిన డబ్బులు తీసుకునేందుకు ‘జీపీడీపీ’అడ్డంకిగా మారిందన్నారు. పైన పేర్కొన్న విషయాలపై మంత్రి పొన్నంతోపాటుగా పంచాయితీరాజ్ మంత్రి సీతక్క, పంచాయతీరాజ్ కమిషనర్‌ను కూడా కలిసి విన్నవించామని వివరించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు పలువురు సర్పంచుల వినతి


