జిల్లా వ్యాప్తంగా మోస్తరు వానలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఖుషిగా తమ సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. రెండు రోజులుగా మేఘావృతమై చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షాలు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నాయి. దీంతో ఆరుతడి పంటలతో పాటుగా వరి నాట్లు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సగటున 15 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా దుబ్బాక , అక్బర్‌పేట–భూంపల్లి మండలాల్లో 31మిల్లీమీటర్లు, దౌల్తాబాద్ మండలంలో 30మి.మీ., మర్కూక్‌లో 28మి.మీ., అక్కన్నపేటలో 25మి.మీ., సిద్దిపేట రూరల్ మండలంలో 22మి.మీ., రాయిపోల్‌లో 18మి.మీ., మిరుదొడ్డి, కొండపాక మండలాల్లో 17మి.మీ., నారాయణరావుపేట, గజ్వేల్ మండలాల్లో 16 మి.మీ., హుస్నాబాద్ మండలంలో 14మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
తగ్గిన ఉష్ణోగ్రతలు: వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. దీనికి తోడు మేఘావృతమైన ఆకాశం ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గాయి. జిల్లాలో గరిష్ట 27 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండగా, కనిష్టంగా 21 డిగ్రీలుగా నమోదు అయ్యాయి. దీంతో పాటుగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో శీతలగాలులు వీస్తున్నాయి.
పత్తిచేను కళకళ
పట్టణంలో కురుస్తున్న వర్షం


