● నేడు జిల్లా వ్యాప్తంగా వనమహోత్సవం ● కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామంలో మంగళవారం 1000 మొక్కలు నాటాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మరో రెండు, మూడు రోజులు వర్షం కురవనున్న క్రమంలో మొక్కలు నాటేందుకు సరైన సమయమన్నారు. వన మహోత్సవం సందర్భంగా జిల్లాలో 17 లక్షల 68వేల మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే మొక్కటు నాటేందుకు 2లక్షల గుంతలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అన్ని మున్సిపాలిటీల్లో, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఇరిగేషన్ శాఖ ఖాళీ ప్రదేశాల్లో మ్కొలు నాటాలన్నారు.
లింగ నిర్ధారణపరీక్షలు చేస్తే చర్యలు
జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కానింగ్, డయాగ్నోస్టిక్ సెంటర్లలో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో పీసీ అండ్ పీఎన్‌డీటీ యాక్ట్, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌పై జిల్లా సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని స్కానింగ్, డయాగ్నోస్ సెంటర్ల, ఆస్పత్రుల యాజమాన్యాలు కొత్తగా రిజిస్ట్రేషన్‌కై కావాల్సిన ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు. అనంతరం జిల్లా జడ్జి సుదర్శన్ మాట్లాడుతూ అన్ని ఆసుపత్రుల్లో పీసీ అండ్ ిపీఎన్‌డీటీ యాక్ట్‌కు సంబంధించిన రిజిస్టర్స్ నిర్వహణ చేయాలన్నారు.


