ఎఫ్‌ఆర్‌ఎస్‌ దుర్వినియోగంపై కలెక్టర్‌ సీరియస్‌ | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఆర్‌ఎస్‌ దుర్వినియోగంపై కలెక్టర్‌ సీరియస్‌

Aug 6 2026 8:08 AM | Updated on Aug 6 2026 8:08 AM

సాక్షి, సిద్దిపేట: ఎఫ్‌ఆర్‌ఎస్‌ (ఫేస్‌ రికగ్నేషన్‌ సిస్టం) దుర్వినియోగంపై కలెక్టర్‌ హైమావతి సీరియస్‌ అయ్యారు. పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇన్‌, అవుట్‌లు ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా అటెండెన్స్‌ నమోదు చేసుకుని తరగతులు చెప్పకుండా బయట తిరుగుతూ దుర్వినియోగం చేస్తుండటంతో సాక్షిలో ‘హాజరు పక్కా... క్లాసులకు డుమ్మా’ శీర్షికన కథనం ప్రచురితమైంది. హెచ్‌ఎంలతో బుధవారం జరిగిన సమావేశంలో ఎఫ్‌ఆర్‌ఎస్‌ను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్‌ అదేశించారు. అలాగే రోజూ సాయంత్రం 6గంటలకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ రిపోర్ట్‌ను అందించాలని డీఈఓను అదేశించినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో ఎంఈఓలు పరిశీలించాలని అదేశించారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ను దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement