డీఈవో రమేశ్
మద్దూరు(హుస్నాబాద్): ఉత్తమ సేవలతోనే ఉద్యోగులకు ప్రజలల్లో మంచి గుర్తింపు లభిస్తుందని డీఈవో రమేశ్ పేర్కొన్నారు. మద్దూరు మండల కేంద్రంలో దూల్మిట్ట విద్యాశాఖ అధికారి(ఎంఈవో) ,బైరాన్‌పల్లి హెచ్‌ఎం మాడిశెట్టి మీనాంజనేయులు ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, ఉపాధ్యాయ వృత్తికి మీనాంజనేయులు వన్నె తెచ్చారని కొనియాడారు. కార్యక్రమంలో మద్దూరు, చేర్యాల ఎంఈవోలు వరదరాజు,నరేందర్,రిటైర్డు ఏసీపీ తుమ్మలపల్లి నారాయణ, వివిధ ఉపాధ్యాయ సంఘల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన ఆహారం, విద్య అందుతోందా?
మద్దూరు(హుస్నాబాద్): పాఠశాల, హాస్టల్‌లో అన్ని మౌలిక సౌకర్యాలు బాగున్నాయా? రుచికరమైన ఆహారం, నాణ్యమైన విద్యా బోధన అందుతోందా అని జిల్లా ఇన్‌చార్జి విద్యాధికారి రమేశ్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం మద్దూరు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, వసతి గృహాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వార్డెన్‌తో మాట్లాడుతూ..క్రమం తప్పకుండా మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రామ్మోహన్,ఎంఈవో వరదరాజు,వార్డెన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


