● ఆ దిశగా పనులు వేగవంతం చేయాలి
● ఏపీఎంలకు కలెక్టర్ హైమావతి ఆదేశం
● వర్గల్ మహిళా సమాఖ్యకార్యాలయ సందర్శన
వర్గల్(గజ్వేల్): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు ఒక జత స్కూల్ డ్రెస్‌ను ఆగస్టు15 రోజున తప్పనిసరిగా అందించాలని ఏపీఎంలను జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆదేశించారు. వర్గల్ మండల మహిళా సమాఖ్య కార్యాలయానికి శుక్రవారం కలెక్టర్ సందర్శించారు. స్కూల్ డ్రెస్ తయారీ క్లాత్‌ను, స్వయం సహాయక సంఘాల మహిళలు కటింగ్, కుట్టుపని ప్రక్రియను పరిశీలించారు. ఏపీఎం కిరణ్‌కుమార్, సమాఖ్య కార్యదర్శి లావణ్య, ఎస్‌హెచ్‌జీ మహిళలతో కలెక్టర్ మాట్లాడారు. క్లాత్ వృథా కాకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఒక జత స్కూల్ డ్రెస్సు ఆగస్టు 15నాటికి అందించాలని, ఆ దిశగా పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. అనంతరం వర్గల్ ప్రభుత్వాస్పత్రి సందర్శించారు.


