అవగాహన కల్పిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

అవగాహన కల్పిస్తున్నాం

Aug 1 2026 7:46 AM | Updated on Aug 1 2026 7:46 AM

అవగాహన కల్పిస్తున్నాం వ్యాధి తీవ్రతను పెంచుకోవద్దు

దుబ్బాక మున్సిపల్‌ పరిధిలోని 20 వార్డుల్లో వారానికి రెండుసార్లు వార్డు అధికారులు, ఎన్‌ఎన్‌ఎం, ఆశ కార్యకర్తలతో ‘ఫ్రైడే–డ్రై డే’కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వార్డుల్లో సైతం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నాం. నిల్వ నీటిని తొలగించేలా, డెంగీ వ్యాప్తి, నివారణ చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.

–మహేశ్‌ కుమార్‌,

మున్సిపల్‌ కమిషనర్‌, దుబ్బాక

దోమల వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్త పడాలి. నిల్వ నీటిలో లార్వా ద్వారా ఏడిస్‌(టైగర్‌) దోమ వ్యాప్తి చెందుతుంది. జ్వరం వస్తే ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న పీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించండి. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అర్హత లేని డాక్టర్లను సంప్రదించి వ్యాధి తీవ్రతను పెంచుకోవద్దు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెంగీ, ఇతర జ్వరాలకు మందులు అందుబాటులో ఉన్నాయి.

–డాక్టర్‌ ధన్‌రాజ్‌, డీఎంహెచ్‌ఓ, సిద్ధిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement