స్నేహం అమూల్యం | - | Sakshi
Sakshi News home page

స్నేహం అమూల్యం

Jul 31 2026 7:16 AM | Updated on Jul 31 2026 7:16 AM

ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి

గజ్వేల్‌రూరల్‌: సమాజంలో స్నేహానికున్న విలువ వెలకట్టలేనిదని ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి పేర్కొన్నారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గేయ రచయిత రాయారావు విశ్వేశ్వరరావు రూపొందించిన ప్రత్యేక పాటను గజ్వేల్‌ పట్టణంలో గురువారం ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్నేహితుల మధ్య ఉండే అభిమానం, ఆప్యాయతను పాట రూపంలో చక్కగా వర్ణించారని ప్రశంసించారు. మనము నమ్మే...మనల్ని నమ్మే స్నేహితుడు జీవితంలో ఎన్నటికీ విడిచిపోడని, కష్టాలు ఎన్ని ఎదురైనా అండగా ఉంటాడని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజమౌళి, నాయకులు గోపాల్‌రెడ్డి, గోలి సంతోష్‌, ఆపన్నహస్త మిత్రబృందం, లయన్స క్లబ్‌ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం

తపస్‌ ఉపాధ్యాయ సంఘం

నంగునూరు(సిద్దిపేట): ఉపాధ్యాయుల సమస్యలను కలసికట్టుగా పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తపస్‌ ఉపాధ్యాయ సంఘం సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. మండలశాఖ ఆధ్వర్యంలో గురువారం సభ్యత్వ అభియాన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ...ఎన్నో ఏళ్లు సమస్యలపై పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు. ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టి పీఆర్‌సీ ఊసే ఎత్తడంలేదని తెలిపారు. సీపీఎస్‌ రద్దు, బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వాలని, విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో మండలశాఖ అధ్యక్షుడు రామిరెడ్డి, శ్రీకాంత్‌, చంద్రకాంత్‌, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశం, రాములు, మురళిధర్‌రెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

టీచర్ల సమస్యలను పరిష్కరించాలి

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం (తపస్‌) జిల్లా అధ్యక్షుడు చిలుముల మురళీధర్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలో గురువారం ఆయన మాట్లాడుతూ..ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలుపరచటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందన్నారు. ఆగస్టు 1న తపస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించనున్న మహాధర్నాలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

బీజేపీ ఓబీసీ మోర్చా

జిల్లా కమిటీ నియామకం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా సిద్దిపేట జిల్లా కమిటీని గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్‌ ప్రకటించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షు డిగా మల్లన్నగారి భిక్షపతి, ఉపాధ్యక్షుడిగా బడెకోల్‌ నర్సింహులు, కంకణాల నర్సింహులు, కొండి శంకర్‌, ప్రధాన కార్యదర్శులుగా మా మిండ్ల నాగులు, బొడ్డు నర్సింహులు, కార్యదర్శులుగా దేవుని ఉపేందర్‌, నిమ్మల శ్రీనివాస్‌, సందొబోయిన కుమారస్వామి, కార్యవర్గ సభ్యులుగా చెన్నగోని వెంకటేశ్‌గౌడ్‌, పున్న రమేశ్‌, రంగనబోయిన కుమార్‌ తదితరులను నియమించినట్లు అధ్యక్షుడు ప్రకటించారు.

నేటి నుంచి

సైన్స్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు

సిద్దిపేటఎడ్యుకేషన్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ప్రాంతీయ అభ్యాసకుల సహాయక కేంద్రంలో సైన్స్‌ విద్యార్థులకు ఈ నెల 31 నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు రీజనల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ శ్రద్ధానందం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరం మూడవ సంవత్సరం 6వ సెమిస్టర్‌, ద్వితీయ సంవత్సరం 3వ సెమిస్టర్‌ విద్యార్థులకు ఆగస్ట్‌ 6వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు కొనసాగుతాయిని పేర్కొన్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించే ఈ పరీక్షలకు విద్యార్థులు కళాశాల గుర్తింపు కార్డు, హాల్‌టికెట్‌ను వెంట తెచ్చుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 7382929615 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement