సీసీ కెమెరా నెట్‌వర్క్‌ గ్రిడ్‌ మా లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సీసీ కెమెరా నెట్‌వర్క్‌ గ్రిడ్‌ మా లక్ష్యం

Jul 31 2026 7:16 AM | Updated on Jul 31 2026 7:16 AM

సీపీ రష్మీ పెరుమాళ్‌

సీపీ రష్మీ పెరుమాళ్‌

హుస్నాబాద్‌: సిద్దిపేట జిల్లాను సీసీ కెమెరా నెట్‌వర్క్‌ గ్రిడ్‌గా తయారు చేయాలనే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని సీపీ రష్మీ పెరుమాళ్‌ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో కొత్తగా నిర్మించిన ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ (ట్రాఫిక్‌ అవుట్‌ పోస్ట్‌)ను గురువారం ఆమె ప్రారంభించారు. స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పోలీస్‌ శాఖ నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. ఈ సందర్బంగా సీపీ రష్మీ పెరుమా ళ్‌ మాట్లాడుతూ... గతంలో ట్రాఫిక్‌ విభాగం కోసం ప్రత్యేక స్థలం లేకపోవడం వల్ల సిబ్బందికి ఇబ్బంది ఉండేదన్నారు. పట్టణంలోని ట్రాఫిక్‌ ఇబ్బందులు నివారించడానికి, ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్‌ అవుట్‌ పోస్ట్‌ను ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల అనుబంధంగా సిద్దిపేట సురక్ష నేత్రను ప్రారంభించామని చెప్పారు.

పోలీస్‌ ఉద్యోగమిత్ర పోర్టల్‌పై అవగాహన

సిద్దిపేట పోలీస్‌ ఉద్యోగమిత్ర పోర్టల్‌ గురించి అన్ని గ్రామాల్లో యువతకు అవగాహన కల్పించాలని సీపీ సూచించారు. హుస్నాబాద్‌ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యాలయానికి వచ్చిన సీపీకి పోలీస్‌లు గౌరవ వందనం సమర్పించారు. కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. అన్ని రకాల రికార్డులు, దర్యాప్తులో ఉన్న కేసుల వివరాలను నిశితంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్‌ కుశాల్కర్‌, ఏసీపీ సదానందం, హుస్నాబాద్‌ సీఐ శ్రీధర్‌, చేర్యాల సీఐ రమేశ్‌, ట్రాఫిక్‌ ఎస్సై వెంకటేశ్వర్‌రెడి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement