పీఎంశ్రీలకు బతుకమ్మ నిధులు | - | Sakshi
Sakshi News home page

పీఎంశ్రీలకు బతుకమ్మ నిధులు

Jul 31 2026 7:16 AM | Updated on Jul 31 2026 7:16 AM

● ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 108 పీఎంశ్రీ స్కూల్స్‌ ● గతేడాది పండుగ ముగిసిన తర్వాత... ఈసారి ముందుగానే నిధులు

● ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 108 పీఎంశ్రీ స్కూల్స్‌ ● గతేడాది పండుగ ముగిసిన తర్వాత... ఈసారి ముందుగానే నిధులు

సాక్షి, సిద్దిపేట: పీఎం శ్రీ ప్రభుత్వ పాఠశాలల్లో బతుకమ్మ పండుగ వేడుకలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పాఠశాలల్లో సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని ఒక్కో పాఠశాలకు రూ.10వేల చొప్పున ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 108 పాఠశాలలకు రూ.10.80 లక్షలు మంజూరు చేసింది. బతుకమ్మ పండుగ చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యంపై విద్యార్థుల్లో అవగాహనను కల్పించాలి. బతుకమ్మకు సంబంధించిన జానపద పాటలు, తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలపై విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించాలి. పర్యావరణహితంగా కార్యక్రమం చేపట్టాలి. గతేడాది పీఎం శ్రీ స్కూళ్లకు బతుకమ్మ వేడుకలకు నిధులను ఆలస్యంగా మంజూరు చేయడంతో కొన్ని పాఠశాలలల్లోనే నిర్వహించారు. మరికొన్ని పాఠశాలలో బతుకమ్మ వేడుకలను నిర్వహించకుండానే బిల్లులు పెట్టి డబ్బులను హెచ్‌ఎంలు డ్రా చేశారు. ఈసారి అందుకే ముందుగానే నిధులు విడుదల చేసింది.

జిల్లా పాఠశాలల సంఖ్య కేటాయింపు

సిద్దిపేట 33 రూ.3.30 లక్షలు

సంగారెడ్డి 44 రూ.4.4 లక్షలు

మెదక్‌ 31 రూ. 3.10 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement