భారీ మత్స్యం.. వలకు చిక్కి | - | Sakshi
Sakshi News home page

భారీ మత్స్యం.. వలకు చిక్కి

Jul 31 2026 7:16 AM | Updated on Jul 31 2026 7:16 AM

ఆసక్తిగా తిలకించిన గాగిళ్లాపూర్‌ గ్రామస్తులు

బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని గాగిళ్లాపూర్‌ శివారులోని గొల్లకుంట కాలువలో గురువారం చేపలు పడుతున్న నేరెళ్ల పర్శయ్య వలలో సుమారు 15 కేజీల భారీ చేప(వాలు) చిక్కింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కుంటకు నీరుచేరుతుండటంతో పర్శయ్య చేపలు పట్టేందుకు వెళ్లాడు. తోటపల్లి పెద్ద చెరువు నుంచి చేపలు ఎదురెక్కి వస్తుండగా అందులోని ఈ భారీ చేప లభించింది. కాగా, భారీగా ఉన్న చేపను తిలకించి గ్రామస్తులు అబ్బుర పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement