● కలెక్టర్ హైమావతి ● గజ్వేల్ బాలికల ఎడ్యుకేషన్ సందర్శన
గజ్వేల్: గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో ‘దోస్త్’ ద్వారా అడ్మిషన్‌లు పొందిన విద్యార్థినులకు హాస్టల్ సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ హైమావతి పేర్కొన్నారు. గజ్వేల్‌లోని బాలికల ఎడ్యుకేషన్ హబ్‌ను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా డిగ్రీ కళాశాలలో సమస్యలను తెలుసుకున్నారు. డిగ్రీ కళాశాల వెనుకభాగంలో ఉన్న భవనాలను హాస్టల్ కోసం సిద్ధం చేయాలని, అందులో ముందుగా ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ కోసం కొన్ని గదులను కేటాయించాలన్నారు. విద్యార్థినులు ఉండటం కోసం బెడ్స్, వాష్‌రూమ్‌లు, కిచెన్ ఏర్పాటు చేయాలని ఈడబ్ల్యూడీసీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ గజ్వేల్ ఆర్‌డీఓ చంద్రకళ, మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అనిత, ఈడబ్ల్యూడీసీ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీడబ్ల్యూ శారద, పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


