న్యూస్‌రీల్
యూరియా కష్టాలు వీడేనా మీసేవలో యూరియా బుకింగ్ ఉపయోగకరంగా ఉండదని రైతులు వాపోతున్నారు. వివరాలు 8లో u
పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఫలితం కానరావడం లేదు. వివరాలు 9లో u
సోమవారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2026
పంట రుణం చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు రోజూ ఇంటికి వస్తుండ్రు. నోటీసులు కూడా ఇచ్చారు. గత యాసంగిలో కడదామంటే అకాల వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఈసారైనా పంటలు పండుతాయనుకుంటే.. వానలు కురుస్తలేవు. ఈ కరువు కాలంలో రుణం ఎలా కట్టేది?.. ఎలా బతికేది?
– ఎల్లవ్వ, మహిళ, రైతు
దుబ్బాకరూరల్: పంట రుణాలు చెల్లించాల్సిందేనంటూ బ్యాంకు అధికారులు నోటీసులు పంపుతుండటంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. అసలే ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొనడం.. మరోవైపు కరువు కమ్ముకొస్తున్న ఈ తరుణంలో రుణాలు ఎలా చెల్లించేది అంటూ వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది రైతుల రుణాలను మాఫీ చేసింది. అందరికీ మాఫీ చేస్తారని గంపెడాశతో ఎదురు చూసినా చివరకు కొందరికి నిరాశే మిగిలింది. అయితే బ్యాంకు అధికారులు మాత్రం రైతు ఇంటికి వచ్చి రుణం చెల్లించాల్సిందేనని నోటీసులు ఇచ్చి వెళ్తున్నారు. రుణం మాఫీ చేస్తారనుకుంటే బ్యాంక్ అధికారులు ఇంటికి వచ్చి ఫొటోలు, నోటీసులు ఇవ్వడంతో రైతులు కంగుతింటున్నారు.
యాసంగిలో దెబ్బతిన్న పంటలు
యాసంగిలో వేసిన పంటలు అకాల వర్షాలు.. వడగళ్లవానలతో పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న పంటలు నేల మట్టమయ్యాయి. మరి కొన్ని చోట్ల మొక్కజొన్న పంటలు, వరి పంటలు అగ్నికి దగ్ధమయ్యాయి. దీంతో పంట రాబడి రాకుండా పోయింది. సాగుకు అప్పులు తీసుకువచ్చి పెట్టుబడులు పెడితే.. చేతి కొచ్చిన పంట రైతు కళ్లెదుటే దెబ్బతినడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు.
పంట రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్ల హుకుం
అయోమయంలో అన్నదాతలు
మరోవైపు కమ్ముకొస్తున్న కరువు


