జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): శాలివాహన సంఘాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలో హుస్నాబాద్, చిన్నకోడూరు మండలాలకు చెందిన శాలివాహన కుల సంఘాల నాయకులు దరిపల్లి చంద్రాన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దరిపల్లి చంద్రం మాట్లాడుతూ ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాలివాహనుల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తోందన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ శాలివాన సంఘం అధ్యక్షుడు బెక్కంటి భీమయ్య, ఇటికాల స్వామి, నాంపల్లి సమ్మయ్య, నమిలి కొండ ఐలయ్య, తిరుపతి, భూపతి, ప్రదీప్, పరశురాములు, శ్రీధర్, కుంటయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


