కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్
హుస్నాబాద్: పోటీ ప్రపంచంలో విద్యార్థులు కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్సాన్‌పల్లిలోని రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీఎస్ గ్రూప్‌లో 468/470 మార్కులతో హుస్నాబాద్ విద్యార్థిని రాధారపు వైష్ణవి రాష్ట్ర ప్రథమ ర్యాంక్ సాధించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మంత్రి వైష్ణవి నివాసానికి వెళ్లి అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైష్ణవి ఈ ప్రాంత విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. గురుకులాల్లో చదువుకున్న దాదాపు 150 మంది ప్రతిభ కనబరిచిన ఇంటర్ విద్యార్థులకు సన్మానించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ కౌన్సిలర్లు మ్యాదరబోయిన శ్రీనివాస్. చిత్తారి పద్మ తదితరులు ఉన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్
ఇంటర్ రాష్ట్ర టాపర్‌కు సన్మానం


