ఇంటర్‌లో తెలుగు తప్పనిసరిగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌లో తెలుగు తప్పనిసరిగా ఉండాలి

Apr 25 2025 11:32 AM | Updated on Apr 25 2025 11:50 AM

ఇంటర్

ఇంటర్‌లో తెలుగు తప్పనిసరిగా ఉండాలి

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ఇంటర్‌లో తెలుగు భాష స్థానంలో సంస్కృతం ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం మానుకోవాలని జాతీయ సాహిత్య పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐతా చంద్రయ్య అన్నారు. గురువారం సాయంత్రం సిద్దిపేట శాఖా గ్రంథాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అధికార భాష హోదా దక్కినా తెలుగును కళాశాల విద్యలో తొలగించడం ఎంతవరకు సమంజమన్నారు. జాతీయ సాహిత్య పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు ఎన్నవెళ్లి రాజమౌళి మాట్లాడుతూ తెలుగుభాష ఉన్నంతవరకు మనకు గౌరవం దక్కుతుందని, ఇతర భాషల వల్ల వెనుకబడి పోతున్నామన్నారు. జాతీయ సాహిత్య పరిషత్‌ ప్రధాన కార్యదర్శి ఉండ్రాళ్ళ రాజేశం మాట్లాడుతూ భాషకు గౌరవం దక్కాలంటే ప్రతి ఒక్కరూ తెలుగు చదవాలన్నారు. కార్యక్రమంలో ఆర్థిక కార్యదర్శి బస్వరాజు కుమార్‌, చీకోటి రాములు, వంగరి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

ఆలయ భూములు

కబ్జా చేస్తే చర్యలు

దుబ్బాకరూరల్‌: ఆలయాల భూములు కబ్జాకు పాల్పడితే చర్యలు తప్పవని దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయలక్ష్మి హెచ్చరించారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం మండలంలోని హబ్సిపూర్‌లో భూములను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ దేవాదాయ పరిధిలో 1417, 1418 సర్వే నంబర్‌లో 11ఎకరాల భూమి ఉందన్నారు. భూమిని కొంత మంది కబ్జా చేయాలని చూస్తున్నారని తెలిపారు. కొందరు ఏకంగా భవనాలు నిర్మించేందుకు పనులు చేపడుతున్నారని, వారికి నోటీసులు జారీ చేశామన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

నేడు బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవామేళా

సిద్దిపేటకమాన్‌: సిద్దిపేట బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో శుక్రవారం వినియోగదారుల సేవామేళా నిర్వహించనున్నట్లు ఏజీఎం లక్ష్మణ్‌ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ఈ మేళా కొనసాగుతుందన్నారు. వినియోగదారులు మొబైల్‌ తదితర సేవలు, సమస్యల పరిష్కారం కోసం మేళాను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

ప్రయాణికులకు

మెరుగైన సేవలందిస్తాం

సిద్దిపేటకమాన్‌: ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తామని సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్‌ రఘు తెలిపారు. సిద్దిపేట డిపోలో నిర్వహించిన ప్రగతి చక్ర అవార్డు కార్యక్రమంలో గత రెండు నెలల్లో విధి నిర్వహణలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన 92మంది సిబ్బందిని గురువారం అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించి సిద్దిపేట, దుబ్బాక డిపోలను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ మహేశ్వరి, అసిస్టెంట్‌ ఇంజనీరు రంజిత్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

డిగ్రీ అడ్మిషన్లకు ఆహ్వానం

పటాన్‌చెరు టౌన్‌: డిగ్రీలో అడ్మిషన్లకు దరఖాస్తులు కోరుతున్నారు. మెదక్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, వికారాబాద్‌, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ ప్రాంతాల్లో ఇంటర్‌ పూర్తి చేసిన గిరిజన విద్యార్థులు పెద్దకంజర్లలో అడ్మిషన్‌ తీసుకోవచ్చని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ సోమనాథ శర్మ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన, ఎస్సీ, బీసీ విద్యార్థులకు అడ్మిషన్లు గురుకుల నియమ నిబంధనలకు లోబడి అడ్మిషన్‌ కల్పించనున్నట్లు చెప్పారు. అడ్మిషన్‌ కోసం నేరుగా కళాశాలను సంప్రదించాలని కోరారు. అడ్మిషన్‌ పొందిన విద్యార్థులకు ఉచిత భోజన వసతి, విద్య, యూనిఫాం, ఉచిత ఎగ్జామినేషన్‌ ఫీజు అందించనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 94948 24692, 80080 70959 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలన్నారు.

ఇంటర్‌లో తెలుగు  తప్పనిసరిగా ఉండాలి 
1
1/1

ఇంటర్‌లో తెలుగు తప్పనిసరిగా ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement