జీవనోపాధికి చేయూత | - | Sakshi
Sakshi News home page

జీవనోపాధికి చేయూత

Apr 17 2025 7:03 AM | Updated on Apr 17 2025 7:03 AM

జీవనో

జీవనోపాధికి చేయూత

డీఆర్డీఏ పీడీ జయదేవ్‌ ఆర్య

చిన్నకోడూరు(సిద్దిపేట): చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడంతో పాటు పేదలకు జీవనోపాధి కల్పించడమే వాటర్‌ షెడ్‌ పథకం లక్ష్య మని డీఆర్డీఏ పీడీ జయదేవ్‌ ఆర్య అన్నారు. బుధవారం చౌడారంలో వాటర్‌ షెడ్‌ యాత్ర నిర్వహించారు. అలాగే జీవనోపాధి కింద నెలకొల్పిన పలు యూనిట్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. వర్షపు నీరు వృథాకాకుండా ఈ పథకం ద్వారా కందకాలు, రాతికట్టడాలు, చెక్‌డ్యామ్‌లు నిర్మించుకోవచ్చన్నారు. తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. వృథా నీటిని భూమిలో ఇంకేందుకు ఇంకుడు గుంతలు నిర్మించాలన్నారు. నాలుగు రెవెన్యూ గ్రామాల్లో 311 మందికి రూ.1.54 కోట్ల రుణాలు వీఓల ద్వారా మహిళల జీవనోపాధికి అందజేశామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారి రాధిక, అదనపు పీడీ బాలకిషన్‌, డీపీఎం కరుణాకర్‌, ఏడీపీ శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీడీఓ జనార్దన్‌, వాటర్‌ షెడ్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ నూరొద్దిన్‌, ఎంపీఓ సోమిరెడ్డి, ఏపీఓ స్రవంతి, ఏపీఎం ఆంజనేయులు పాల్గొన్నారు.

సామర్థ్యాలను పెంచేందుకే ఏఐ బోధన: డీఈఓ

చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యలో వెనుకబడిన విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఏఐ బోధన ఎంతగానో దోహదపడుతుందని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం రామంచ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించారు. కంప్యూటర్‌ ల్యాబ్‌లో విద్యార్థులు చేస్తున్న ఏఐ టూల్స్‌ ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఈ విధానంతో విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే కంప్యూటర్‌ పరిజ్ఞానం పెరుగుతుందన్నారు. అన్ని పాఠశాలల్లో నెట్‌ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం పాఠశాలల రికార్డులు, మధ్యాహ్న భోజనంతో పాటు ఆవరణలో నాటిన పండ్ల మొక్కలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ యాదవరెడ్డి, హెచ్‌ఎంలు సత్తవ్వ, అబ్దుల్‌ షరీఫ్‌, ఉపాధ్యక్షు లు భాస్కర్‌, సురేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఇళ్ల నిర్మాణాలు

వేగిరం చేయండి

అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌

గజ్వేల్‌రూరల్‌: లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ సూచించారు. మండల పరిధిలోని గిరిపల్లి గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటిని 400 నుంచి 600 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించుకోవాలని సూచించారు. ఎలాంటి ఆటంకంలేకుండా ఇళ్లకు ఇసుక సరఫరాపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ చంద్రకళను ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ దామోదర్‌రెడ్డి, ఎంపీడీఓ ప్రవీణ్‌, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

23న మున్సిపల్‌ షెటర్లకు వేలం

దుబ్బాకటౌన్‌: పట్టణంలో మూడు చోట్ల ఉన్న 26 మున్సిపల్‌ షెటర్లకు ఈనెల 23న అద్దె ప్రాతిపాదికన బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో పోచమ్మ దేవాలయ సమీపంలో ఉన్న 16 షెటర్లకు, శాస్త్రి విగ్రహ సమీపంలో ఉన్న ఆరు షెటర్లకు, డబుల్‌ బెడ్రూం సమీపంలో ఉన్న 4 షెటర్లకు వేలం నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గల వారు పోచమ్మ సమీపంలో ఉన్న షెటర్లకు రూ. 50 వేలు, మిగతా రెండు చోట్ల ఉన్న షెటర్లకు రూ.25వేల డీడీ తీసి దరఖాస్తు ఫారంతో ఈ నెల 22న కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

జీవనోపాధికి చేయూత 1
1/2

జీవనోపాధికి చేయూత

జీవనోపాధికి చేయూత 2
2/2

జీవనోపాధికి చేయూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement