బలహీనవర్గాల సత్తా చాటాలి: నవీన్
బెజ్జంకి(సిద్దిపేట): వచ్చే ఎన్నికలలో బలహీనవర్గాల సత్తా చాటాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొంకటి నవీన్ పిలుపునిచ్చారు. బెజ్జంకిలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమష్టిగా కృషి చేసి అన్ని రంగాలలో రాణించాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలిచిన విధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో విజయం సాధించాలని కోరారు. గెలుపొందిన ప్రజా ప్రతినిధులకు జనవరి 23న బెజ్జంకిలో సన్మానం చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బొనగం రాజేశం, బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీదర్, ఉపసర్పంచ్ దూమాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జెండాను ఎగురవేయాలి
ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్
గజ్వేల్‌రూరల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్‌లో బీజేపీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు ముందుకు సాగాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బి.శంకర్ పిలుపునిచ్చారు. పట్టణంలోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ పట్టణశాఖ అధ్యక్షుడు మనోహర్‌యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శంకర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులను పూర్తి చేయడంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. పెండింగ్ పనులు, సమస్యల పరిష్కారానికై బీజేపీ రాజీలేని పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, బీజేపీ నాయకులు రాంరెడ్డి, శ్రీనివాస్, రాములు, మధు, శివకుమార్, బోసు తదితరులు పాల్గొన్నారు.
కొండాపూర్(సంగారెడ్డి): శ్రమ చేసి సంపదను సృష్టిస్తున్న కార్మికులపై కేంద్ర ప్రభుత్వం పగబట్టి, కార్పొరేట్లకు వ్యాపారాలు అప్పజెప్పుతున్నారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ఆరోపించారు. శుక్రవారం కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంగారెడ్డిలోని సుందరయ్య భవన్ నుంచి ఐబీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనాడు యూపీఏ ప్రభుత్వం గ్రామీణ పేదలను ఆదుకోవాలని ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. నేడు బీజేపీ ప్రభుత్వం మతంపైన శ్రద్ధ పెడుతూ ప్రజలు, కార్మికులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. మహాత్మాగాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, వీబీ రాంజీ పేరు చేర్చి చట్టాన్ని బలహీనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లేశం, సాయిలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జయరాజ్, అధ్యక్షుడు రాజయ్య, సీఐటీయూ నాయకులు రాజయ్య, మాణిక్ పాండురంగారెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
చేగుంట(తూప్రాన్): కేవల్ కిషన్ ఆశయ సాధనకు ఉద్యమిద్దామని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడివయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని పొలంపల్లిలో కేవల్ కిషన్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవల్ కిషన్ పేద ప్రజల కోసం తన సొంత భూములను సైతం విరాళంగా అందించి చెరువులను తవ్వించాడని పేర్కొన్నారు. భూస్వాముల కుట్రలకు బలైన డిసెంబర్ 26న ఏటా ప్రజలు జాతర నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం సీపీఎం ఆధ్వర్యంలో చేగుంట వరకు పాదయాత్ర నిర్వహించారు.
బలహీనవర్గాల సత్తా చాటాలి: నవీన్
బలహీనవర్గాల సత్తా చాటాలి: నవీన్


