కాంగ్రెస్‌ది ప్రజా వ్యతిరేక పాలన
హత్నూర(సంగారెడ్డి): కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదని, ప్రజావ్యతిరేక పాలనని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో మంజూరైన సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్థాయి మరిచి ప్రతిపక్ష నాయకుడిపై విమర్శలు చేయడం తప్ప, సంక్షేమ పథకాలపై ధ్యాస లేదన్నారు. పంచాయతీ కార్యదర్శులు అప్పుల పాలై ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం నిధులు మంజూరు చేయడం లేదన్నారు. నాలుగు నెలలుగా జీపీ కార్మికులకు వేతనాలు ఇవ్వలేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తి చేసి 37 వేల ఎకరాలకు కేసీఆర్ నీరందిస్తే, ఈ ప్రభుత్వం రెండేళ్లలో కనీసం 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేదన్నారు.
ఎమ్మెల్యే సునీతారెడ్డి


