కూర్పు.. కావాలి మార్పు
న్యూస్‌రీల్
గట్టి టీం కోసం ప్రయత్నాలు పరిషత్ మున్సిపల్ ఎన్నికలకు ముందే కమిటీల ఏర్పాటు పదవుల కోసం ప్రయత్నాలు నేడు డీసీసీ కార్యాలయంలోపరిశీలకుల సమావేశం
శనిగరం సింగారం మండలంలోని శనిగరం జలాశయాన్ని ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్‌సందర్శించారు. వివరాలు 8లో u
కాంగ్రెస్ కమిటీలపై కసరత్తు
సాక్షి, సిద్దిపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గతంతో పోల్చితే ఎక్కువ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందడంతో ఆ పార్టీ కార్యకర్తలు జోష్‌లో ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లోగా జిల్లా కాంగ్రెస్ కమిటీలను నియమించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షురాలుగా టి.ఆంక్షారెడ్డిని నియమించగా.. తనకు తోడుగా గట్టి టీంను నియమించాలని కసరత్తు ముమ్మరం చేశారు. ఈ కమిటీల నియామకం కోసం పీసీసీ నుంచి పరిశీలకులు మల్లాది వపన్, రోహిత్ రావులను నియమించారు. జిల్లా కమిటీ, పట్టణ కమిటీలు ఉంటే త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పురపాలక సంఘాల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ఎక్కువ మంది పనిచేయడానికి వీలు కలుగుతుందని, అందుకే నోటిఫికేషన్‌కు ముందుగానే పదవులను భర్తీ చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. సర్పంచ్ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగాయి. అదే పరిషత్, పురపాలిక సంఘాల ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగనుండటంతో ఫలితాలపై ప్రభుత్వం, పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీంతో జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీలు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది.
పోటీ ఎక్కువే..
కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే మహిళలు, యువతకు పదవుల్లో పెద్దపీట వేయాలని అధిష్టానం నిర్ణయించింది. ఇకపై పార్టీ కమిటీలే అన్ని నిర్ణయాల్లో కీలక పాత్ర వహిస్తాయనే సంకేతాలతో వీటిని దక్కించుకునేందుకు నాయకులు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. డీసీసీ కమిటీ, మండల, బ్లాక్ కమిటీలే ఇక పార్టీలో క్రియాశీలక పాత్ర వహిస్తాయని సంకేతాలివ్వడంతో పదవులను దక్కించుకునేందుకు నేతల్లో పోటీ మొదలైంది. ఒక్కో బ్లాక్‌కు ఇద్దరు ఉపాధ్యక్షులు, ఇద్దరు ప్రధాన కార్యదర్శులను నియమించాల ని పార్టీ నాయకత్వం సూచించినట్లు సమాచారం. ప్రతి మండలం నుంచి ఒక కార్యదర్శి, ప్ర తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక అధికార ప్రతినిధి ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కార్యవర్గ సభ్యులను దాదాపు 15 మంది వరకు నియమించనున్నారు. ఇప్పటికే మంత్రు లు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో పలువురు నేతలు డీసీసీలో చోటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పలువురు రాష్ట్ర నాయకులు నేతల పేర్లను సైతం సిఫార్సు చేసినట్లు సమాచారం.
నేడు సమావేశం
జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, పీసీసీ పరిశీలకులు పవన్, రోహిత్ రావు శనివారం సమావేశం నిర్వహించనున్నారు. జనవరి మొదటి వారంలోగా పరిశీలకులు జాబితాను సిద్ధం చేసి పీసీసీకి పంపిస్తే వాటిని పరిశీలించి సంక్రాంతిలోగా ఆమోదముద్ర వేయనున్నారు.


