కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు | - | Sakshi
Sakshi News home page

కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు

Mar 4 2025 7:11 AM | Updated on Mar 4 2025 7:10 AM

హుస్నాబాద్‌రూరల్‌: కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. సోమవారం హుస్నాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కిషన్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ అభివృద్ధి జరగడం ఇష్టంలేదని, అందుకే నిధులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులకు ప్రతిపాదనలు ఇచ్చి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వడంలేదని పొన్నం ప్రశ్నించారు. వరంగల్‌ ఎయిర్‌ పోర్టు తన వల్లనే వచ్చిందని పక్క రాష్ట్రం కేంద్ర మంత్రితో చెప్పించుకోనే దుస్థితి కిషన్‌రెడ్డికే దక్కిందన్నారు. వరంగల్‌ ఎయిర్‌ పోర్టు కోసం ఏనాడైనా కిషన్‌రెడ్డి ప్రయత్నం చేశారా? అని మంత్రి ప్రశ్నించారు. మరో కేంద్రమంత్రి బండి సంజయ్‌ కేసీఆర్‌కు బీనామీగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో మీకు బాధ్యత లేదా? నిధులు రాకుండా ఎందుకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తమిళనాడు వంటి రాష్ట్రాలు అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేస్తాయని, మన కేంద్ర మంత్రులు అభివృద్ధికి ఎందుకు సహకరించడం లేదన్నారు. రాష్ట్రానికి కేంద్ర నిధులు తేవడం కిషన్‌రెడ్డికి ఇష్టం లేదన్నారు. అభివృద్ధిని అడ్డుకునే కుట్రలను సహించబోమని, అభివృద్ధి నిరోధకులుగా కేంద్ర మంత్రులు ఎందుకు వ్యవహర్తిస్తున్నారో చెప్పాలన్నారు. మీకు అభివృద్ధి చేయాలనే అలోచనే ఉంటే హైదరాబాద్‌ నుంచి రామగుండం వరకు రాజీవ్‌ రహదారిని 8 వరుసలకు విస్తరించాలని డిమాండ్‌ చేశారు. కుల గణన సర్వే పై బీఆర్‌ఎస్‌కు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. సర్వేలో పాల్గొనని వారికి ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు అవకాశం ఇచ్చామని, కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావులకు స్వయంగా నేను సర్వే పత్రాలను పంపించిన సర్వేలో వారి వివరాలను ఇవ్వలేదన్నారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కంది తిరుపతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ బొలిశెట్టి శివయ్య తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌

కేసీఆర్‌ బినామీగా

బండి సంజయ్‌ వ్యవహరిస్తుండు

తెలంగాణలో అభివృద్ధి జరగడం

వారికి ఇష్టం లేదు

మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement