శాసనసభ ఎన్నికలకు సంబంధించి అధికారులు తుది ఓటరు జాబితాను ప్రకటించారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో 9,48,669 మంది ఓటర్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఈ జాబితా ప్రకారమే ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. అన్నిచోట్లా మహిళా ఓటర్లే అధికంగా ఉండటంతో వారే నేతల తల రాతలను మార్చనున్నారు.
తేలిన లెక్క
● 23 వేలకు పెరిగిన ఓటర్ల సంఖ్య
● గజ్వేల్‌లో అత్యధికం
● జిల్లాలో ఓటర్లు 9.48లక్షలు
● పురుషులు 4.68లక్షలు..
● మహిళలు 4.80లక్షలు
● తుది జాబితానుప్రకటించిన అధికారులు