ఆశావర్కర్లను ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆశావర్కర్లను ఆదుకోవాలి

Nov 17 2026 8:17 AM | Updated on Nov 17 2026 8:17 AM

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: ఆశావర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్‌ వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హామీలను అమలు చేయాలని కోరుతూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయ ఏఓకు సమ్మె నోటీసు అందజేశారు. ఈసందర్భంగా సాయిలు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వేతనాలు పెంచడంతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్‌, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అయి తే మూడేళ్లు సమీపిస్తున్నా హామీలు అమలుకు నోచుకోలేదని వాపోయారు. కార్యక్రమంలో యూ నియన్‌ అధ్యక్షురాలు శశికళతో పాటు నాయకులు మంజుల, ప్రశాంతి, ఎలీషా, లక్ష్మి, వరలక్ష్మి, వీరమణి, శిరీష, శశిరేఖ, విమల పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement