● 50 అర్జీల స్వీకరణ
● హాజరైన అదనపు కలెక్టర్ సంగీత, డీడబ్ల్యూఓ లలిత కుమారి
సంగారెడ్డి జోన్: బాలల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణికి విశేష స్పందన వచ్చింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు తరలివచ్చి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ మేరకు 50 అర్జీలు రాగా, అదనపు కలెక్టర్ సంగీత, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి అధికారుకు వినతులు అందించారు. ‘నా రోజు, నా హక్కులు, నా భవిష్యత్తు’ అని నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
వసతులు.. ఇతర సమస్యలు
బాలల ప్రత్యేక ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు తరలివచ్చారు. పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు అదనపు గదులు, ప్రహరీలు నిర్మించాలని వేడుకున్నారు. శిథిలావస్థకు చేరిన మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. అదేవిధంగా ఉపాధ్యాయుల కొరత తీర్చాలని, పాఠశాలలకు వెళ్లేందుకు సమయానికి బస్సులు నడపాలన్నారు. పాఠశాలల్లో సమస్యలు ఉండటంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బాలల ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఆటలకు గ్రౌండ్ లేదు
మా పాఠశాలలో ఆటలు ఆడుకునేందుకు గ్రౌండ్‌తో పాటు ఇతర సౌకర్యం కల్పించాలి. పలువురు విద్యార్థులు పోతిరెడ్డిపల్లి నుంచి వస్తుంటారు. సరైన విధంగా బస్సు సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకొని సమస్యలు పరిష్కరించాలి.
– అందోల్ బాలికల ఉన్నత పాఠశాల
ḥѧéÅǦ¯]l$Ë$


