రైతుకు ఆధునిక పరికరాలు | - | Sakshi
Sakshi News home page

రైతుకు ఆధునిక పరికరాలు

Nov 16 2026 8:47 AM | Updated on Nov 16 2026 8:47 AM

అద్దె ప్రాతిపదికన అందజేత

40 శాతం సబ్సిడీ

నారాయణఖేడ్‌: మారుతున్న కాలంతో పాటు వ్యవసాయ రంగంలోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అధునాతన పరికరాలు, యంత్రాలతో నేడు వ్యవసాయం చేస్తూ రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. కాగా, పెద్ద రైతులకే ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అధునాతన పరికరాలు ఇక నుంచి సన్న, చిన్నకారు రైతులకు కూడా అందుబాటులోకి రానున్నాయి. రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేయకుండానే రైతులు వినియోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. ఆర్థిక స్థోమత లేని కర్షకులకు గ్రామస్థాయిలోనే అద్దె ప్రాతిపదికన అందించేలా కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. డ్రోన్లు మొదలుకొని ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌, సోయింగ్‌, ప్లాంటింగ్‌, ఇంటర్‌ కల్టివేషన్‌, ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ ఇలా.. రైతులకు అవసరమైన 37 రకాల యంత్రాలను అందుబాటులో ఉంచేలా గుర్తించారు.

సంఘాల బలోపేతం

గ్రామస్థాయిలో రైతు ఉత్పత్తి దారుల సంఘాలు (ఎఫ్‌పీఓలు), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌లు), మహిళా స్వయం సహాయక సంఘాలను భాగస్వాములను చేయనున్నారు. గ్రామస్థాయిలో రైతులకు అందుబాటులో ఉన్న ఈ సంఘాలను బలోపేతం చేయడంతో పాటు రైతులకు పరికరాలు అందుబాటులో ఉంచేలా వీరి ద్వారా కృషి చేస్తున్నారు. పై సంఘాల ఆధ్వర్యంలో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల (సీహెచ్‌సీ)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామస్థాయిలో సంఘాలు పరికరాల కొనుగోలు చేసేలా అధికారులు ప్రొత్సహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న సంఘాలకు అర్హతను బట్టి ప్రభుత్వం ఎంపిక చేయనుంది.

ఇక క్షేత్రస్థాయిలో అందుబాటులో..

కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు (సీహెచ్‌సీ) ఏర్పాటు

మహిళా సంఘాలు, పీఏసీఎస్‌లకు అవకాశం

కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 60:40 నిష్పత్తిలో నిధులు సమకూర్చనున్నారు. ఎంపికై న సంఘాలకు అవసరమైన యంత్ర పరికరాలను కొనుగోలు చేసిన అనంతరం మొత్తం వ్యయంలో 40 శాతం సబ్సిడీగా అందించనున్నారు. రాయితీ మొత్తం గరిష్టంగా రూ. 20 లక్షలుగా ఉండనుంది. దీంతో సంఘాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకుండానే ఆధునిక వ్యవసాయ పరికరాలను సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. కనీసం మూడేళ్ల క్రితం ఏర్పాటై అప్పటి నుంచి నిరంతరాయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎఫ్‌పీఓలు, పీఏసీఎస్‌, మహిళా సంఘాలే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులను నిర్ధారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement