మంత్రి దామోదర రాజనర్సింహ
జోగిపేట(అందోల్): పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు వెంటనే ప్రారంభించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలోని రోడ్డును స్వయంగా పరిశీలించారు. అజ్జమర్రి బ్రిడ్జి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి కానున్నాయని, రిక్షా కాలనీ మీదుగా అంబేద్కర్ విగ్రహం నుంచి క్లాక్‌టవర్ వరకు 70 ఫీట్ల రోడ్డు ఏర్పాటుకు సంబంధించి క్లియర్ చేయాలని స్థానిక నాయకులను ఆదేశించారు. ఈ ప్రాంత పరిధిలోని కౌన్సిలర్లు దగ్గరుండి పనులు చేయించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక స్థోమత లేని వారుంటే సహకరించాలని, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోకపోతే నాయకులు వారికి అండగా నిలవాలన్నారు. పూర్తయిన పనులను త్వరలోనే ప్రారంభించి, కొత్త పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మంత్రి వెంట జోగిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల చిట్టిబాబు ముదిరాజ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు డీజీ వెంకటేశ్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్‌రెడ్డి, నాయకులు సురేందర్‌గౌడ్, నాగరాజు, యాదయ్యతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.


