పేదల సంక్షేమానికి కృషి | - | Sakshi
Sakshi News home page

పేదల సంక్షేమానికి కృషి

Nov 16 2026 8:47 AM | Updated on Nov 16 2026 8:47 AM

పేదల సంక్షేమానికి కృషి నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ప్రయాణికులకు ఆర్టీసీ రాయితీ నూతన నియామకం అందుబాటులో సబ్సిడీ విత్తనాలు 17న సామూహిక సెలవు

నారాయణఖేడ్‌: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని గునుకుల కుంట, కంగ్జి మండలం ఎడ్లరేగడి తండాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విడతల వారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తూ అండగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమం కోసం మరెన్నో పథకాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తోందని వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ బాణాపురం రాజు, ఆయా పంచాయతీల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

నారాయణఖేడ్‌: కల్హేర్‌, ఫత్తేపూర్‌లోని 33 కేవీ సబ్‌స్టేషన్లలో మరమ్మతుల కారణంగా సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా సబ్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ఖేడ్‌ ట్రాన్స్‌కో ఏడీఈ నాగిరెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

జహీరాబాద్‌ టౌన్‌: ఆర్టీసీ బస్సులో నెలవారీ సీజన్‌ టికెట్లలో సంస్థ రాయితీ ఇస్తున్నట్లు డిపో మేనేజర్‌ రాజేశ్వరి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 14 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయన్నారు. డీలక్స్‌, ఈ–డీలక్స్‌ బస్సుల్లో నెలవారీ రూట్‌ పాస్‌ తీసుకుంటే మహిళలు కేవలం 15 రోజుల ప్రయాణ చార్జీ చెల్లిస్తే సరిపోతుందన్నారు. పురుషులు 20 రోజుల ప్రయాణ చార్జీని మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. నెలవారీ పాస్‌ ఉన్నవారు అదనంగా రూ. 20 చెల్లించి ఇతర కేటగిరి బస్సుల్లోనూ ప్రయాణించవచ్చన్నారు. పాస్‌ హోల్డర్లు తమ నిర్ణీత రూట్‌ వెలుపల రాష్ట్ర పరిధిలో సూపర్‌ లగ్జరీ అంతకంటే పై కేటగిరీ బస్సుల్లో ప్రయాణిస్తే ప్రాథమిక టికెట్‌ చార్జీపై 10 శాతం రాయితీ లభిస్తుందని తెలిపారు. 3 నెలల పాస్‌ను ఒకేసారి తీసుకునే ప్రయాణికులకు ఎలాంటి అదనపు చార్జీ లేకుండా 10 రోజుల అదనపు వ్యాలిడిటి లభిస్తుందని చెప్పారు. రాయితీ బస్‌ పాస్‌లు జహీరాబాద్‌ బస్టాండ్‌లోని కౌంటర్‌లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

సంగారెడ్డి: సంగారెడ్డి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడుగా ఉన్న సంజీవరెడ్డి తెలంగాణ న్యా యవాదుల అసోసియేషన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అసోసియేషన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నందుకు బాధ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు.

పాపన్నపేట(మెదక్‌): ఆరుతడి పంటల వేయాలనుకునే రైతులకు సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేస్తామని మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్‌ రాజు తెలిపారు. జొన్న, మొక్కజొన్న, కుసుమ, నువ్వులు, మినుములు, అలసందలు, పల్లీలు, కూరగాయలు వేసుకోవాలనుకునే వారు సోమవారం సాయంత్రంలోగా వివరాలు అందజేయాలని కోరారు. సోలార్‌ కంచెలు, డ్రిప్‌, స్ప్రింక్లర్లు కావాలనుకునే వారు కూడా వివరాలు ఇవ్వాలని సూచించారు.

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): పాత పింఛన్‌ విధా నాన్ని అమలు చేయాలని కోరుతూ ఈ నెల 17న సాముహిక సెలవు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టీఎస్సీపీఎస్‌ఈయూ సంఘం నాయకులు తెలిపారు. ఉద్యోగుల భవిష్యత్తు, వారి సామాజిక భద్రత కోసం జరుగుతున్న సీపీఎస్‌ రద్దు పోరాటానికి ప్రతి ఉద్యోగి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement