ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు 51% ఫిట్‌మెంట్ ప్రకటించి వెంటనే పీఆర్‌సీని అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు చిట్యాల విజేందర్‌రెడ్డి అధ్యక్షతన ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన సిద్దిపేట జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పీఆర్‌సీ వేసి మూడేళ్లు గడుస్తున్నప్పటికీ నివేదికను తెప్పించుకుని ఫిట్‌మెంట్ ప్రకటించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 2008 కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న మండల విద్యాధికారుల, డిప్యూటీ డీఈవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గాడిపల్లి తిరుపతిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దామెర రాజయ్య వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తిరుపతి డిమాండ్


