వైభవంగా ఛట్‌ పూజ | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ఛట్‌ పూజ

Nov 16 2026 8:47 AM | Updated on Nov 16 2026 8:47 AM

జిన్నారం(పటాన్‌చెరు): గుమ్మడిదల పరిధిలోని బొంతపల్లి, గడ్డపోతారం జీఎంఆర్‌ కాలనీలో ఆదివారం ఛట్‌ పూజను ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బీహార్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ప్రజలు చెరుకు గడలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, సూర్య భగవానుడిని భక్తితో ఆరాధించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరై మాట్లాడారు. అన్నిరాష్ట్రాల ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ సోదర భావంతో పండగలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గడ్డపోతారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గద్దె సుష్మ, కౌన్సిలర్‌ గండి స్వప్న రూ. 2.50 లక్షల సొంత నిధులతో చట్‌ పూజ ఘాట్‌ను నిర్మించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు, మహిళా భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement