సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని నిజాంపూర్ కాలనీ ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం రామకృష్ణ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ స్ఫూర్తి పురస్కారం అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చేతుల మీదుగా పురస్కారం స్వీకరించారు. విద్యా, పర్యావరణం, సామాజిక సేవా రంగాల్లో రామకృష్ణ చేసిన కృషికి గానూ పురస్కారం అందజేస్తున్నట్లు ప్రగతి ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. రామకృష్ణకు ఎంఈఓ శంకర్, కాంప్లెక్స్ హెచ్‌ఎం రాజశ్రీ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.


