పండ్ల తోటలతో లాభాలు అధికం | - | Sakshi
Sakshi News home page

పండ్ల తోటలతో లాభాలు అధికం

Oct 2 2026 7:32 AM | Updated on Oct 2 2026 7:32 AM

ములుగు(గజ్వేల్‌): రైతులకు అదనపు ఆదాయం, కుటుంబాలకు పోషకాహార భద్రత కల్పించడంతో పాటు సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కొట్యాలలో వాణిజ్య, గృహ వినియోగ పండ్ల తోట నమూనాను ఏర్పాటు చేశారు. రిటైర్డ్‌ అదనపు కలెక్టర్‌ మంద రవీందర్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన ఈ తోటను గురువారం కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ రాజిరెడ్డి ప్రారంభించారు. మహీధర ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ విజ్ఞప్తి మేరకు వర్సిటీ నిపుణులు శాసీ్త్రయ లేఅవుట్‌ రూపొందించి సాంకేతిక సహకారం అందించారు. ఒక ఎకరంలో 14 మామిడి రకాలకు చెందిన 140 మొక్కలు, మరో ఎకరంలో కొబ్బరి, సపోటా, జామ, నిమ్మ, మునగ, అరటి, పనస, నేరేడు, అంజీర్‌, దానిమ్మ తదితర 214 మిశ్రమ పండ్ల మొక్కలను ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా అధికారులు వివిధ రకాల పండ్ల మొక్కలను నాటారు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement