బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని గాగిళ్లాపూర్‌కు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు అన్నాడి కిష్టారెడ్డి (104) గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. మృతునికి ఇద్దరు కుమారులు, కోడల్లు, మనుమలు, అల్లుడు ఉన్నారు. పలు పార్టీల నాయకులు గ్రామస్తులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
మద్దూరు(హుస్నాబాద్): ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దూల్మిట్ట మండలంలోని కూటిగల్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దాసారం సుధాకర్ (40) పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత 8 నెలలుగా ఎక్కడా పని దొరకకపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనై మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెంది బుధవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి ఒక కుమారుడు, ఇద్దరు కుమారైలు ఉన్నారు. భార్య రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీస్‌లు తెలిపారు.
గాంధీ విగ్రహం ధ్వంసం
నంగునూరు(సిద్దిపేట): గుర్తుతెలియని దుండగులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటన రాజగోపాల్‌పేటలో చోటు చేసుకుంది. గాంధీ జయంతిని పురస్కరించుకొని పెద్దఎత్తున వేడుకలు నిర్వహించేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనేపథ్యంలో గురువారం తెల్లవారుజామున విగ్రహం ధ్వంసం అయినట్లు గుర్తించారు. గ్రామ నడిబొడ్డులో ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులతో కలసి సర్పంచ్ చేర్యాల వాణి రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ప్రమాదవశాత్తు బైక్ దగ్ధం
శివ్వంపేట(నర్సాపూర్): ప్రమాదవశాత్తు బైక్ దగ్ధమైన సంఘటన మండల పరిధి గోమారం– నవాబుపేట ప్రధాన రహదారి లచ్చిరెడ్డిగూడం గ్రామం వద్ద గురువారం చోటు చేసుకుంది. మండల పరిధి గుండ్లపల్లి గ్రామానికి చెందిన బాదారి సాయిరాంరెడ్డి, జస్వంత్‌రెడ్డిలు బైక్‌పై గ్రామం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. గోమారం పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకుని కొద్దిదూరం వెళ్లగా లచ్చిరెడ్డిగూడం గ్రామ శివారులో బైక్ ఇంజన్‌లో నుంచి మంటలు వస్తుండటం గమనించి బైక్‌ని పక్కకు ఆపేశారు. ఈ ఘటనలో బైక్ పూర్తిగా దగ్ధమైంది.
రెజ్లింగ్‌లో విద్యార్థుల సత్తా
నారాయణఖేడ్: సంగారెడ్డిలోని అంబేడ్కర్ మైదానంలో బుధవారం రాత్రి వరకు కొనసాగిన ఎస్‌జీఎఫ్ ఉమ్మడి మెదక్ జిల్లాస్థాయి రెజ్లింగ్ (కుస్తీ) పోటీల్లో ఖేడ్‌లోని తెలంగాణ మైనారిటీ బాలుర గురుకుల ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. ముస్తేప్, అయాన్, రిజ్వాన్, రెహాన్, ఉమర్, అద్నాన్ బంగారు పథకాలు సాధించారు. వారిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు, సమన్వయకర్తలు జాకీర్, సంజీవ్‌నాయక్, వ్యాయామ ఉపాధ్యాయులు సంతోష్, అజీజ్ అభినందించారు.
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్..
వ్యక్తికి తీవ్రగాయాలు
కౌడిపల్లి(నర్సాపూర్): ట్రాక్టర్‌ను వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని తి మ్మా పూర్‌గేట్ శ్రీరాఘవేంద్ర నర్సరీ సమీపంలోని 765డీ జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ ఆండాలు కథనం ప్రకారం.. తునికి నుంచి వస్తున్న ట్రాక్టర్‌ను డ్రైవర్ తిమ్మాపూర్‌గేట్ సమీపంలో రోడ్డు పక్కన ఆపి బహిర్భూమికి వెళ్లాడు. అదే సమయంలో ఎల్లారెడ్డికి చెందిన రాజు తన బైక్‌పై హైదరాబాద్ నుంచి ఎల్లారెడ్డికి వస్తున్నాడు. చీకటిలో ఆగి ఉన్న ట్రాక్టర్ కనిపించకపోవడంఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు.


