నైపుణ్యాలు పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

Oct 2 2026 7:32 AM | Updated on Oct 2 2026 7:32 AM

సిద్దిపేటఎడ్యుకేషన్‌: పనిలో సామర్థ్యాన్ని, వేగాన్ని పెంచేందుకు కృత్రిమ మేధస్సును ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని వక్తలు అభిప్రాయపడ్డారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్‌ కళాశాల ఆడిటోరియంలో కామర్స్‌ విభాగం ఆధ్వర్యంలో కృత్రిమ మేధస్సు–నైపుణ్యాల అభివృద్ధి అనే అంశంపై గురువారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల పూర్వవిద్యార్థి, ఓయూ కామర్స్‌ విభాగం మాజీ డీన్‌, కేరళ సెంట్రల్‌ యూనివర్సిటీ మాజీ వీసీ దివంగత ప్రొఫెసర్‌ హెచ్‌ వెంకటేశ్వర్లు స్మారకార్థం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యవక్తగా ఓయూ కామర్స్‌ బోర్డ్‌ అఫ్‌ స్టడీస్‌ చైర్‌పర్సన్‌, ప్రొఫెసర్‌ ప్యాట్రిక్‌ ఆంథోని హాజరై మాట్లాడారు. కృత్రిమ మేథస్సు(ఏఐ)తో ఉద్యోగాలు పోతాయనే భయాందోళనను వీడాలన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారి ఏఐని సాధనంగా ఉపయోగించుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ అయోధ్యరెడ్డి, కళాశాల కామర్స్‌ విభాగాధిపతి, సీఓఈ డాక్టర్‌ గోపాలసుదర్శనం, టీఎస్‌కేసీ కోఆర్డినేటర్‌ ఉమామహేశ్వరీ, డాక్టర్‌ శ్రీనివాస్‌, గురుచరణ్‌దాస్‌తో పాటు సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement