వట్‌పల్లి(అందోల్): అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.లక్ష విలువైన అల్ఫ్రాజోలం పట్టుకున్న ఘటన అందోల్ మండల పరిధిలోని అన్నాసాగర్ వద్ద గురువారం చోటుచేసుకుంది. జోగిపేట ఎకై ్సజ్ సీఐ ఏడుకొండలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అన్నాసాగర్ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్ సమీపంలో ఓ వ్యక్తి నిషేధిత అల్ఫ్రాజోలం అనే మత్తు పదార్థం విక్రయిస్తున్నట్లు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు మెదక్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎకై ్సజ్ అధికారులు అదే గ్రామానికి చెందిన పలనాటి నర్సింహాగౌడ్ అనే వ్యక్తి పట్టుకొని 81 గ్రామాల నిషేధిత అల్ఫ్రాజోలం గుర్తించి స్వాధీనం చేసుకొన్నారు. దీని విలువ సుమారుగా రూ.లక్ష వరకు ఉంటుందన్నారు. అతనిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. రూ.2లక్షల పూచికత్తుపై బైండోవర్ చేయడం జరిగిందని సీఐ తెలిపారు.


