విద్యార్థులకు నవోదయం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు నవోదయం

Oct 2 2026 7:32 AM | Updated on Oct 2 2026 7:32 AM

9, 11వ తరగతిలో చేరికకు అవకాశం

వర్గల్‌(గజ్వేల్‌): గ్రామీణ విద్యార్థుల వరప్రదాయిని ఉమ్మడి మెదక్‌ జిల్లా వర్గల్‌ జవహర్‌ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతిలో లెటరల్‌ ఎంట్రీ పరీక్ష ద్వారా ఖాళీ సీట్లలో బాలబాలికలు ప్రవేశం పొందే అవకాశాన్ని నవోదయ విద్యాలయ సమితి కల్పించింది. 2027–28 విద్యాసంవత్సరం ఈ సీట్లలో అడ్మిషన్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్‌ డీ.రాజేందర్‌ తెలిపారు. ఏప్రిల్‌ 10న ప్రవేశ పరీక్ష, అందులో ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఆయన తెలిపారు.

దరఖాస్తుకు అర్హతలు

విద్యార్థులు ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెంది ఉండాలి. వారి తల్లిదండ్రులు ఇక్కడే నివాసమై ఉండాలి. 9వ తరగతిలో ప్రవేశం కోసం అభ్యర్థులు ప్రస్తుత విద్యాసంవత్సరం(2026–27)లో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వగుర్తింపు పొందిన పాఠశాలలో 8వ తరగతి చదువుతూ ఉండాలి. మే 1, 2012 – జూలై 31, 2014 మధ్య జన్మించి ఉండాలి. 11వ తరగతిలో ప్రవేశం పొందగోరు విద్యార్థులు ప్రస్తుత విద్యాసంవత్సరం(2026–27)లో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వగుర్తింపు పొందిన పాఠశాలలో 10వ తరగతి చదువుతూ ఉండాలి. జూన్‌ 1, 2010 – జూలై 31, 2012 మధ్య జన్మించి ఉండాలి. మరింత సమాచారం కోసం నవోదయ.గవ్‌.ఇన్‌ వెబ్‌సైట్‌ సందర్శించాలని ప్రిన్సిపాల్‌ సూచించారు. ఉమ్మడి జిల్లా అభ్యర్థులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ నెల 15వరకు దరఖాస్తు గడువు

ఏప్రిల్‌ 10న ఎంట్రెన్స్‌ పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement