జోగిపేట(అందోల్): అందోలు మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జోగిపేటలోని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 356 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ లోక్ అదాలత్‌లో జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ అసదుల్లా షరీఫ్ అధ్యక్షులుగా బెంచ్ సభ్యులుగా సీనియర్ న్యాయవాదులు ఎస్.నారాయణరెడ్డి, ఎస్.కృష్ణారెడ్డిలు వ్యవహరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి షరీఫ్ మాట్లాడుతూ...లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవడం వలన కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. పరిష్కారమైన కేసుల్లో 33 క్రిమినల్, 19 బ్యాంకు, 56 జరిమానా, 237 డ్రంక్ అండ్ డ్రైవ్, 5 సైబర్ కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. జోగిపేట సర్కిల్ సీఐ అనిల్‌కుమార్, జోగిపేట, పుల్కల్, వట్‌పల్లి ఎస్‌ఐలతోపాటు స్థానిక పోలీసు సిబ్బంది, బార్ అసోసియేషన్ న్యాయవాదులు, బ్యాంకు అధికారులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాలొన్నారు.
జూనియర్ కోర్టు సివిల్ జడ్జి
ఎండీ అసదుల్లా షరీఫ్


