పూర్తిస్థాయిలో రైల్వే సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

పూర్తిస్థాయిలో రైల్వే సమస్యల పరిష్కారం

Sep 13 2026 11:27 AM | Updated on Sep 13 2026 11:27 AM

రామచంద్రాపురం(పటాన్‌చెరు): ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పూర్తిస్థాయిలో రైల్వే సమస్యలను పరిష్కరిస్తామని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శనివారం తెల్లాపూర్‌ డివిజన్‌ పరిధిలోని విద్యుత్‌నగర్‌ కాలనీకి వెళ్లే మార్గంలో రైల్వే అండర్‌ బ్రిడ్జిని రైల్వే, సీఎంసీ అధికారులతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రసుత్తం ఉన్న రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద నిత్యం ట్రాఫిక్‌ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈసమస్యను పరిష్కరించేందుకు రూ.21 కోట్ల నిధులను మంజూరు చేయించినట్లు చెప్పారు. అందులో భాగంగా రైల్వే, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పర్యటించామన్నారు. త్వరలో అండర్‌ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. నిర్మాణం పనుల సమయంలో ప్రజలకు, వాహనాదారులకు ఇబ్బంది పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా తెల్లాపూర్‌ రైల్వేస్టేషన్‌, రేడియల్‌ రోడ్డు7కు అసుసంధానం చేసేందుకు ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పటాన్‌చెరు సర్కిల్‌ ఉపకమిషనర్‌ జ్యోతిరెడ్డి, డివిజన్‌ బీజేపీ అధ్యక్షుడు రాంబాబు గౌడ్‌, తేనా అధ్యక్షుడు రమణ, మాజీ కౌన్సిలర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement