గజ్వేల్‌రూరల్: మట్టి గణపయ్యలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడుదామని గజ్వేల్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మన్వీర్ పిలుపునిచ్చారు. పట్టణంలోని సరస్వతి శిశుమందిర్‌లో రామకోటి భక్తసమాజం సంస్థ ఆధ్వర్యంలో మట్టి గణపతులకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన గణపయ్య విగ్రహాల వల్ల పర్యావరణం కలుషితమయ్యే అవకాశముందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరేశ్‌బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్‌సాగర్‌రావు, సరస్వతి శిశుమందిర్ ప్రధానోపాధ్యాయురాలు హరిణ, నాయకులు సత్యనారాయణ, సోమేశ్, విజయ్‌కుమార్, నర్సింహచారి పాల్గొన్నారు.


