ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులు తాళలేక..

Sep 12 2026 11:09 AM | Updated on Sep 12 2026 11:09 AM

తొగుట(దుబ్బాక): ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని పెద్ద మాసాన్‌పల్లి మదిర వడ్డెర కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. తొగుట ఎస్‌ఐ నవీన్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోదాసు లక్ష్మి, బాలయ్య దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాలయ్య చాలా కాలం క్రితం మరణించగా తల్లి కూలీ పనులు చేసి పిల్లలను పెంచి పెద్ద చేసింది. కాగా వారి చిన్న కుమారుడు సంజీవ్‌ (21) సిద్దిపేట పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సులో క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. కాగా ఈ నెల 9న రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం మృతదేహం కనిపించింది. కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement