ఆగమనమూ..వేడుకే | - | Sakshi
Sakshi News home page

ఆగమనమూ..వేడుకే

Sep 12 2026 11:09 AM | Updated on Sep 12 2026 11:09 AM

వినాయక చవితి పెద్ద పండుగ

దుబ్బాకలో నయా ట్రెండ్‌

దుబ్బాకటౌన్‌: వినాయక చవితి వస్తే చాలు పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా నవరాత్రి ఉత్సవాలు, కుటుంబ సభ్యులతో కలిసి భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కాగా గణేశ్‌ ఆగమన్‌ను సైతం ఘనంగా నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో ఉద్యమాల పురిటిగడ్డ అయినా దుబ్బాకలో వినాయక నిమజ్జనోత్సవాలకు గొప్ప ప్రత్యేకత ఉన్న విషయం తెలిసిందే.

స్వాగతం అదిరే..

మారుతున్న కాలానికి అనుగుణంగా యువత సైతం అప్‌డేట్‌ అవుతున్నారు. వినాయక చవితి దగ్గర పడుతుండడంతో భారీ గణనాథులను పట్టణాల నుంచి స్వగ్రామలకు తీసుకొస్తున్నారు. ప్రతీ సంవత్సరం లాగా నిమజ్జనోత్సవాలను ఘనంగా నిర్వహించే యువత ఈసారి గణేశ్‌ ఆగమన్‌ పేరిట భారీ గణనాథులకు అదిరిపోయే స్వాగతం పలుకుతున్నారు.

సామాజిక మాధ్యమాల్లో పోస్టు..

వినాయకుని ఊరేగింపును వీడియోలు తీస్తూ యువకులు ఇన్‌స్టాలో పోస్టు చేయడంతో వినాయక ఆగమన్‌కు మరింత ప్రత్యేకత పెరిగింది. కేవలం వివాహాల్లో, పెద్ద పెద్ద సభల్లో వాడే డ్రోన్‌లను సైతం ఆగమన్‌ ఊరేగింపునకు వాడటంతో వీడియోలు సామాజిక మాధ్యమాల్లో మరింత ట్రెండ్‌ అవుతున్నాయి.

వినాయకులకు అదిరిపోయే స్వాగతం

భారీ లైటింగ్‌.. డీజే హోరు

హిందూ పండుగలలో వినాయక చవితి అతి పెద్ద పండుగ. ఈ సారి ఆగమన్‌ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ప్రత్యేక బాణాసంచా, పేపర్‌ స్ప్రేతో, డ్రోన్‌తో స్వాగతం పలికాం. ప్రజలు సైతం ఊరేగింపును చూడడానికి వందల సంఖ్యలో రావడం సంతోషం. – నేహాల్‌ గౌడ్‌,

మిత్రయూత్‌ అధ్యక్షుడు, దుబ్బాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement