ట్రాన్స్‌ఫార్మర్‌ కాయిల్స్‌ చోరీ ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్‌ కాయిల్స్‌ చోరీ ముఠా అరెస్టు

Sep 12 2026 11:09 AM | Updated on Sep 12 2026 11:09 AM

కామారెడ్డి క్రైం: కామారెడ్డి, మెదక్‌ జిల్లాల పరిధిలో 52 ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి, కాపర్‌ వైర్‌ చోరీ చేసిన అంతర్‌ జిల్లా ముఠాను కామారెడ్డి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ రాజేశ్‌చంద్ర కేసు వివరాలు వెల్లడించారు. భిక్కనూరు మండల పరిధిలోని పలు గ్రామాల శివారు ప్రాంతాల్లో ఐదు నెలలుగా ట్రాన్స్‌ఫార్మర్‌ కాయిల్స్‌, వైరు, ఇతర వస్తువులు చోరీకి గురవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు భిక్కనూరు ప్రాంతంలో 29, మెదక్‌ జిల్లా పరిధిలో 23 చోట్ల నమోదయ్యాయి. దీంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అనుమానితులను గుర్తించారు. మరోసారి చోరీ చేసేందుకు భిక్కనూరు సమీపంలోని పరివార్‌ హోటల్‌ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. నిందితులను మేడ్చల్‌కు చెందిన బల్జీర్‌ సింగ్‌, రూప్‌సింగ్‌, లకన్‌ సింగ్‌లుగా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నాడు. అంతర్‌ జిల్లా ముఠా సభ్యులు నలుగురూ సొంత అన్నదమ్ములు కావడం గమనార్హం. నిందితులు గతంలో పలు కేసుల్లో జైలుకు వెళ్లొచ్చారని పోలీసులు చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 30 కిలోల కాపర్‌ వైరు, రాడ్లు, చోరీకి ఉపయోగించిన పరికరాలు, బైక్‌, ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

52 ట్రాన్స్‌ఫార్మర్లను

కొల్లగొట్టిన నిందితులు

వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్‌చంద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement