రసాయనాల్లేని సాగుతోనే మేలు | - | Sakshi
Sakshi News home page

రసాయనాల్లేని సాగుతోనే మేలు

Sep 12 2026 11:09 AM | Updated on Sep 12 2026 11:09 AM

ములుగు(గజ్వేల్‌): తెలంగాణలో ఉద్యాన పంటల ఉత్పాదకతను పెంచడంతో పాటు రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించే సాంకేతికతపై పరిశోధనలు జరగాల్సిన అవసరముందని ములుగు కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ రాజిరెడ్డి పేర్కొన్నారు. ఉద్యాన పంటల్లో రసాయనాల వాడకాన్ని తగ్గించి, పర్యావరణ హిత జీవ సాంకేతిక విధానాలను ప్రోత్సహించే లక్ష్యంతో విశ్వవిద్యాలయం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ శ్రీ బయో ఎస్తటిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో శుక్రవారం అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. అన్నదాతలు ఎరువులు, పురుగుల మందులను విచక్షణా రహితంగా వాడకుండా తక్కువ మోతాదు రసాయనాలతో అధిక దిగుబడులు సాధించే సమగ్ర యాజమాన్య పద్ధతులను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఉద్యాన వర్సిటీ వీసీ రాజిరెడ్డి

శ్రీబయోతో వర్సిటీ ఒప్పందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement