కొండపాక(గజ్వేల్): ఎరువుల క్రయ విక్రయాల రికార్డుల్లో తప్పులుండకుండా చూసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి హెచ్చరించారు. మండలంలోని ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ దుకాణాలను శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు. వివిధ రకాల ఎరువులు, పురుగు మందుల నిల్వలు, రిజిస్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్వరూపరాణి మాట్లాడుతూ రైతులు కొనుగోలు చేసే వాటికి తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని, ఈపాస్ ద్వారానే ఎరువుల విక్రయాలు జరగాలన్నారు. పురుగు మందులు, ఎరువులు ఎంఆర్పీ ధర కంటే ఎక్కువకు అమ్మితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏడీఏ బాబూనాయక్, ఏఓ శివరామకృష్ణ పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి


