తెలుగు భాషపై పట్టు పెంచుకునేలా కవిత్వాలతో పాటల రూపంలో సబ్జెక్టును బోధిస్తూ విద్యార్థులకు తెలుగు భాషపై మమకారాన్ని పెంచేలా చేస్తున్న తెలుగు మాష్టారు డాక్డర్ పూర్ణ కృష్ణ అంటే ఎంతో ఇష్టం. తన బోధనా శైలితో విద్యార్థులను ఆకట్టుకుంటూ ప్రతీ విద్యార్థి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారు. తెలుగు భాష గొప్పతనం, సాహిత్యం, సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన కల్పిస్తూ ఆసిక్తికరమైన రీతిలో పాఠాలు బోధిస్తారు. కేవలం సబ్జెక్టుకే పరిమితం కాకుండా కథలు, పద్యాలు, సామెతలు, కవితలు నాటికల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నారు. అందమైన చేతిరాతపై కూడా మెళకువలు నేర్పిస్తారు. అందుకే తెలుగు మాష్టారు అంటే ప్రత్యేకమైన అభిమానం.
–సంపత్ కుమార్, పదోతరగతి, వెల్టూర్


