డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి
సంగారెడ్డి: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకొని గురువారం పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశాన్ని ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు తీసుకెళ్లడంలో రాజీవ్‌గాంధీ కీలకపాత్ర పోషించారని కొనియాడారు. యువతకు ప్రాధాన్యతనిస్తూ, సమాచార సాంకేతిక రంగ అభివృద్ధికి ఆయన వేసిన పునాదులు దేశ ప్రగతికి ఎంతగానో దోహదపడ్డాయని అన్నారు. దేశంలో టెలికాం, కంప్యూటర్ రంగాల విస్తరణకు రాజీవ్ గాంధీ తీసుకున్న చర్యలు భవిష్యత్ భారత నిర్మాణానికి బాటలు వేశాయని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, యువతకు ఓటు హక్కు కల్పించడం వంటి కీలక నిర్ణయాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాజీవ్‌గాంధీ కృషి చేశారని ఆమె గు ర్తుచేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్స న్ కూన వనిత, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హపీజ్, నాయకులు తొపాజీ అనంత కిషన్, కూన సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


