పీపుల్స్‌ ఆస్పత్రికి రూ.25 వేల జరిమానా | - | Sakshi
Sakshi News home page

పీపుల్స్‌ ఆస్పత్రికి రూ.25 వేల జరిమానా

Aug 20 2026 7:32 AM | Updated on Aug 20 2026 7:32 AM

రిజిస్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యం

రిజిస్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యం

పటాన్‌చెరు టౌన్‌: పటాన్‌చెరు పట్టణంలోని పీపుల్స్‌ ప్రైవేట్‌ ఆస్పత్రిని డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగనిర్మల బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని స్కానింగ్‌కు సంబంధించిన వివరాలను యాజమాన్యం సక్రమంగా నమోదు చేయలేదని గుర్తించారు. అలాగే వివిధ దస్త్రాలు, రిజిస్టర్ల నిర్వహణలోనూ నిర్లక్ష్యం కనిపించిందని తెలిపారు. ఉపయోగించిన సూదులను నిబంధనల ప్రకారం విరిచి పారవేయడం లేదని తెలిపారు. స్టెరిలైజేషన్‌ రిజిస్టర్‌ను చూపించాలని అడగగా.. ఎవరో తీసుకెళ్లారని ఆస్పత్రి సిబ్బంది సమాధానం చెప్పడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యానికి రూ.25 వేల జరిమానా విధించి, నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో రిజిస్టర్లను చూపించాలని, లేనిచో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో హెల్త్‌ అసిస్టెంట్‌ రాజేందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement