ఉద్యోగం రాక.. పెళ్లి సంబంధాలు కుదరక.. | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగం రాక.. పెళ్లి సంబంధాలు కుదరక..

Aug 20 2026 7:32 AM | Updated on Aug 20 2026 7:32 AM

మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

తొగుట(దుబ్బాక): ఒక వైపు ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాకపోవడం, మరో వైపు పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. తొగుట పోలీసులు, గ్రామస్తులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మంగళపల్లి కనకయ్య(33) ఎనిమిదేళ్ల క్రితం డిగ్రీ, పీజీ పూర్తి చేశాడు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల కోసం ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. దీనికి తోడు తనకున్న నత్తి కారణంగా సరిగ్గా మాటలు రాకపోవడంతో పెళ్లి సంబంధాలు సైతం కుదరడం లేదు. ఇటు ఉద్యోగం రాక, అటు పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కనకయ్య ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. మృతుని తండ్రి రామచంద్రం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement